క్రైమ్
సైలెంట్ కిల్లర్.. భార్యబిడ్డలను చంపేసి తండ్రికి టీ ఇచ్చి..!
దాంపత్యంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి.ఆ సమయంలో విచక్షణ మరిచిపోతున్న కొందరు భార్యబిడ్డలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు అని కూడా చూడటం లేదు. రక్తపుటేర్లు పారిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్య, ముగ్గురు కూతుర్లను చంపేసి పరార్ అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లోని కార్దానీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..రాహుల్ ఝా తన భార్య గీత, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్లు ఉంటుండగా, కుటుంబ సభ్యులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారు. అయితే, రాత్రి నిద్రపోయాక భార్య, కుమార్తెలు నందిని(23), రాధిక(18), 14 ఏళ్ల అమ్మాయిని రాహుల్ రాయితో కొట్టి చంపాడు. ఆపై ఉదయాన్నే పాలు తీసుకొచ్చి, టీ తయారు చేసి, తండ్రి లక్ష్మీనాథ్కు ఇచ్చి మెల్లగా ఇంటి నుంచి పరార్ అయ్యాడు.
