తెలంగాణ

Siddipet: మానవత్వం మరచిన గజ్వేల్ ఎమ్మార్వో.. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా?.. పురుగుల మందు తాగలేదా?..

అన్నదాత సుఖీభవ అంటాం.. దేశానికి వెన్నెముక రైతు అంటాం. కానీ అదే రైతు తన గోడును వెళ్లబోసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే.. అతనికి ఎదురయ్యే చేదు అనుభవాలు ఎన్నో.. పొలంలో కలుపు తీసినంత సులువుగా సమాజంలోని అధికారుల్లో పెరుగుతున్న కలుపును తుంచలేక లోలోన కుమిలి పోయే రైతులు ఎందరో.. ఇక తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మార్వోకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన రైతుతో అధికారి మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి కోల్పోతున్నానని, బ్రతుకుదెరువు ప్రశ్నార్థకమైందని తన గోడు వెళ్లబోసుకోవడానికి వెళ్లిన ఓ సామాన్య రైతును చూసిన ఎమ్మార్వో.. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా.. అంటూ ప్రశ్నించడం సంచలనంగా మారింది.