ఏపీ
Sick Rooms : ఏపీ సర్కార్ వినూత్న నిర్ణయం.. సర్కారీ స్కూల్స్‌లో ‘సిక్ రూమ్స్’
ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల బాగోగుల కోసం పాఠశాలల్లోనే ‘సిక్’ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సాధారణంగా వాతావరణంలో మార్పుల కారణంగా పిల్లలు జబ్బు పడుతుంటారు. అలాంటి వారిని ఇంటికి పంపించకుండా స్కూల్లోనే ఏర్పాటు చేసిన సిక్ రూమ్స్‌లో విశ్రాంతి కల్పిస్తారు.అలా చేయడం వలన విద్యార్థులు కాస్త సెట్ అయ్యాక మళ్లీ తరగతి గదిలోకి వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. వారికి అవసరమైన ప్రాథమిక వైద్యం కూడా అందించనున్నారని సమాచారం.
