తెలంగాణ

తొలి ప్రపంచ ఓపెన్ తైక్వాండో అక్కాతమ్ముడి సత్తా

తెలంగాణలో నిర్వహించిన తొలి ప్రపంచ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌–2026లో అక్కా తమ్ముడు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఒకేసారి నాలుగు పతకాలు సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆగస్టు 21 నుంచి 23 వరకు జరిగిన ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్న మాలోత్ సాన్వి రియా, మాలోత్ ఆరుష్ మిథుల్ సత్తా చాటారు.దేశంలోని 22 రాష్ట్రాలతో పాటు 12 దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 9వ తరగతి చదువుతున్న సాన్వి రియా 14 ఏళ్లలోపు క్యోరుగి విభాగంలో స్వర్ణ పతకం, పూమ్సే విభాగంలో కాంస్య పతకం సాధించింది. సాన్వి రియా తమ్ముడు, 3వ తరగతి విద్యార్థి ఆరుష్ మిథుల్ 8 ఏళ్లలోపు క్యోరుగి విభాగంలో స్వర్ణ పతకం సాధించగా, వేగవంతమైన పంచింగ్‌ విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు.