National
ఖర్గే సభా వేదికపై ‘శుద్ధి’.. దేశ రాజకీయాల్లో కొత్త రగడ!
ఈ నెల 8న హల్ద్వానీలో జరిగిన కాంగ్రెస్ సభలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్నారు. సభ పూర్తయిన అనంతరం ఆ వేదిక వద్ద పూజ, శుద్ధి కార్యక్రమం నిర్వహించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాజకీయ వివాదం మొదలైంది. వేదికను ఎందుకు శుద్ధి చేశారన్న ప్రశ్న చుట్టూనే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
