సినిమా
Shruti Haasan: మల్టీ టాలెంటెడ్ హీరోయిన్‌ని కమల్ కాపాడుకోవచ్చుగా!
Shruti Haasan: "ఉళగనాయగన్" కమల్ హాసన్ కూతురు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కెరీర్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందా..అంటే అవుననే మాట అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. దీనికి, కారణం ఈ మల్టీ టాలెంటెడ్ చేతిలో ఉంది రెండంటే రెండు సినిమాలు మాత్రమే. తండ్రి కమల్ హాసన్‌కే సొంత నిర్మాణ సంస్థ ఉంది. అదే, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన ఈ బ్యానర్‌లో ప్రస్తుతం, రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. కానీ, అవి కూతురు కోసం చేస్తున్నవి కాదు.
