ఏపీ

తిరుమలలో వాహనాల పార్కింగ్ కొరత.. భక్తులకు తప్పని తిప్పలు!

తిరుమల కొండపై కొత్త సమస్య ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో తరలివచ్చే భక్తుల తాకిడితో పాటు, అదే స్థాయిలో చేరుతున్న ప్రైవేట్ వాహనాలతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు కావడంతో పార్కింగ్ కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యం, ఘాట్ రోడ్డు ప్రమాదాలు టీటీడీ పరిపాలనా యంత్రాంగానికి పెను సవాళ్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం తిరుమలలో ఉన్న 16పార్కింగ్ కేంద్రాల్లో కేవలం 6వేల నుంచి 7వేల వాహనాలను మాత్రమే నిలిపేందుకు వీలుంది.