తెలంగాణ
Shopping Mall Opening: రూ.9లకే చీర.. ఎగబడ్డ జనాలు.. తోపులాట
Shopping Mall Opening: షాపింగ్ మాల్ నిర్వాహకులు ప్రకటించిన రూ.9 చీరల ఆఫర్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రారంభోత్సవ వేళ చీరల కోసం మహిళలు ఎగబడటంతో భారీ ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'గరుడ షాపింగ్ మాల్' ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాల్‌ను ప్రారంభించారు. హీరోయిన్ రాకతో పాటు, ఓపెనింగ్ సందర్భంగా కేవలం రూ.9లకే చీర అందిస్తున్నామంటూ నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
