తెలంగాణ
సిద్దిపేటలో దారుణం.. బతికే ఉన్న 22 మందికి డెత్ సర్టిఫికెట్స్!
రాష్ట్రంలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన 22 మంది వ్యక్తులను చనిపోయినట్టు చిత్రీకరించి వారి పేరిట ఉన్న బీమా సొమ్మును క్లెయిమ్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి బాధిత వ్యక్తులు లబోదిబోమంటున్నారు. దీంతో వెంటనే చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన 22 మంది పేర్లపై నకిలీ మరణ ధ్రువపత్రాలు జారీ అయ్యాయి. వారంతా బతికే ఉన్నా డెత్ సర్టిఫికెట్లు జారీ అవ్వడం కలకలం రేపింది. రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న భూక్య మధు తన అధికారిక ఈ-సైన్ (e-Sign) డాంగిల్‌ను దుర్వినియోగం చేసినట్టు తెలిసింది.
