తెలంగాణ

గణేశ్ నిమజ్జన ఊరేగింపులో దారుణం.. మాంసం వ్యర్థ్యాలు!

హైదరాబాద్ మహానగరంలో మరోసారి శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా ఓ వర్గం ప్రజలు యత్నించారు. దీంతో మరోవర్గం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆదివారం హైదరాబాద్‌లోని పాతబస్తీ మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డబుల్ బెడ్రూం పోలీస్ హౌసింగ్ సొసైటీ వద్ద గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అదే సమయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించారు. ఆ సమయంలో హౌసింగ్ సొసైటీ పై అంతస్తు నుంచి ఓ వర్గానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు మాంసపు వ్యర్థ్యాలను కిందకు విసిరారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.