National
యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి అమానుషం!..
ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. డీయూ లా ఫ్యాకల్టీలో పీహెచ్‌డీ చేస్తున్న శుభమ్ సింగ్.. ఉమంగ్ భవన్ ప్రవేశ ద్వారం వద్ద వేచి ఉండి.. అక్కడికి వచ్చిన లా ఫ్యాకల్టీ సీనియర్ ప్రొఫెసర్ అనుపమ్ ఝాపై అకస్మాత్తుగా దాడికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్డుకునేందుకు ఇతర విద్యార్థులు ప్రయత్నించినప్పటికీ.. ప్రొఫెసర్‌పై పలుమార్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు క్యాంపస్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
