National

సామాన్యులకు షాక్.. చక్కెర కొనుగోలుపై పరిమితులు!

దేశవ్యాప్తంగా చక్కెర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు వారాలుగా ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కేజీ షుగర్ రూ.45 నుంచి ప్రస్తుతం రూ.80 వరకు ఎగబాకింది. దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు.తమ వేతనాలు పెరగడం లేదని కానీ, నిత్యావసరాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగకుండా ప్రభుత్వాలు కట్టడి చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెద్దమొత్తంలో కొనుగోలు చేసి స్టాక్ నిల్వ చేయకుండా ఉండేందుకు కొనుగోళ్లపై పరిమితులు విధించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే క్విక్ కామర్స్ కంపెనీలు అయిన బ్లింకిట్, జెప్టో,స్విగ్గీ, ఇన్ స్టామార్ట్ గరిష్టంగా రూ.3 నుంచి 5 కేజీల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టు సమాచారం. డీమార్ట్‌ వంటి రిటైలర్ దిగ్గజం కూడా ఇదే బాటలో నడుస్తున్నట్టు తెలిసింది.