National

సీజేపీ నేతలకు షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు

కాక్రోచ్ జనతా పార్టీ నేతలకు బిగ్ షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసనలు చేపట్టిన కేసులో సీజేపీ కీలక అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు న్యాయస్థానం మరోసారి షాక్ ఇచ్చింది.వీరి జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు మరో రెండు రోజుల పాటు పొడిగించింది. అయితే, తీర్పు చెప్పే క్రమంలో న్యాయస్థానం సీజేపీ నేతల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులకు చట్టమంటే ఏమాత్రం గౌరవం లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనలు చేపట్టే ప్రాంతాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను డీ నోటిఫై చేసి సున్నితమైన ప్రదేశాల్లో జాబితాలో చేర్చినా అక్కడ పదేపదే నిరసనలకు పిలుపునివ్వడం సీజేపీ నేతలకు అలవాటుగా మారిందని మెజిస్ట్రేట్ అసహనం వెల్లిబుచ్చారు.