తెలంగాణ

బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు

రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సహా మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తోపులాట సైతం నెలకొనడంతో అక్కడ విధి నిర్వహణలో ఉన్న తన పట్ల సదరు నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.