క్రైమ్
ఆమె ప్రేమ చూస్తే అతడు డబ్బు చూశాడు.. చివరకు!
ప్రేమ పేరిట వేధింపులు, మోసాలు, హత్య ఉదంతాలు క్రమంగా పెరుగుతున్నాయి.ఏళ్లుగా ప్రేమించకుంటున్నామని ఇంట్లో చెప్పే ధైర్యం జంటలకు ఉండటంలేదు. బయటకు మాత్రం అమర ప్రేమికులగా నటిస్తున్నారు. ఫలితంగా పెళ్లి విషయం వచ్చేసరికి అబ్బాయి లేదా అమ్మాయి తిరస్కరించడం ఇటీవలి కాలంలో కామన్ అయ్యింది. అయితే, పెళ్లి చేసుకుందామని పిలిచి ఓ యువతిని ప్రియుడు మర్డర్ చేశాడు. అనంతరం ఆమె వద్దనున్న నగదు, బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ హత్యలో నిందితుడికి మరో ముగ్గురు సాయం చేయగా..వారిని తాాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.
