తెలంగాణ

వరంగల్ ఎంజీఎంలో అరిగోస.. వీల్ చైర్ లేదని రోగిని!

వరంగల్ ఎంజీఎంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగులు చుక్కలు చూస్తున్నారు. మెరుగైన వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు సైతం సమయానికి అక్కడ ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా వీల్ చైర్ లేదని ఓ రోగిని తన కుటుంబసభ్యులు భుజాల మీద మోసుకుని ఆస్పత్రి లోనికి తీసుకొచ్చారు. రోగిని ‘ఎక్స్‌రే’కు తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ లేకపోవడంతో ఇలా చేయాల్సివచ్చిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఇక్కడ ఆస్పత్రికి సిబ్బంది నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది.నడవలేని పరిస్థితిలో ఉన్న రోగికి వీల్ చైర్ అందించాల్సిన సిబ్బంది పట్టించుకోలేదని కూడా సమాచారం.వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా వైద్యశాఖ మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇది ఆసుపత్రి కాదు నరకకూపం అని, రోగులకు కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వం ఎందుకని ప్రజలు మండిపడుతున్నారు.