International
Serbia: యూరప్‌లో 14 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలికిన విద్యార్థి లోకం..
ప్రజాస్వామ్యంలో పాలకుల కంటే ప్రజలే బలవంతులని, ముఖ్యంగా విద్యార్థి లోకం తిరగబడితే ఎంతటి బలమైన నియంతలైనా తలవంచక తప్పదని సెర్బియా ఎన్నికల ఫలితాలు మరోసారి చాటిచెప్పాయి. గత 14 ఏళ్లుగా దేశాన్ని తన కనుసన్నల్లో శాసిస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అండదండలతో తిరుగులేని నేతగా వెలుగొందిన అలెగ్జాండర్ ఉసిక్‌ను ఆ దేశ యువత మట్టికరిపించింది. రెండేళ్ల పాటు ఏమాత్రం వెరవకుండా విద్యార్థులు నడిపిన ప్రజా ఉద్యమం ముందు అధికార పక్షం చివరకు చేతులెత్తేసింది. ఫలితాలు వెలువడగానే ఓటమిని అంగీకరించిన ఉసిక్, గద్దె దిగక తప్పలేదు. ఈ సంచలన విజయంతో రాజధాని బెల్‌గ్రేడ్‌తో పాటు ప్రధాన నగరాలన్నీ యువత సంబరాలతో హోరెత్తిపోతున్నాయి. స్వాతంత్ర్యం, స్వేచ్ఛను పునరుద్ధరించుకున్నామంటూ ప్రజలు వేలాదిగా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు.
