స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

సుమంత్ కేసులో సంచలనాలు.. పోలీసుల తీరుపై పలు అనుమానాలు!

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్, వ్యాపారి గొంగిడి హరికృష్ణల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ, రూ.10కోట్ల వసూళ్ల వివాదంలో పోలీసుల విచారణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సుమంత్, అతడి అనుచరులను అరెస్ట్ చేయడంపైనే దృష్టి సారించిన పోలీసులు, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, వసూళ్లకు సంబంధించిన లోతైన అంశాలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూలై 30న దాడి జరిగిందని చెబుతున్న హరికృష్ణ, చాలా రోజుల ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, అలాగే ఫిర్యాదు సమయంలో సీఎంతో సన్నిహిత సంబంధాలు కలిగిన కిరణ్ అనే వ్యక్తి ఆయన వెంట ఉండటం వెనుక పెద్ద రాజకీయ కోణమే దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది.