National

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స!

 బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్‌తో (Chest Infection) బాధపడుతున్న 98 ఏళ్ల అద్వానీని శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శనివారం ఉదయం ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. పల్మనరీ (శ్వాసకోశ) విభాగానికి చెందిన నిపుణులైన వైద్యబృందం అద్వానీకి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది.