సినిమా

Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత..

Giribabu: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రియులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1943 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు, నటనపై ఉన్న అమితమైన ఇష్టంతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా, స్వయంకృషితో ఎదుగుతూ తన సుదీర్ఘ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.