International

సౌదీ యువరాజుకు భద్రతా ముప్పు.. బంకర్లలోకి మకాం!

 యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణి, డ్రోన్ దాడులను విపరీతంగా పెంచడంతో ఆ దేశ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 'వాల్ స్ట్రీట్ జర్నల్' అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. రియాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత, భూగర్భ బంకర్లు కలిగిన రాజప్రాసాదాల మధ్యే ఆయన రహస్యంగా సంచరిస్తున్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన కమాండోల భద్రత నడుమ మకాం మారుస్తున్న ఆయన, గడిచిన మంగళవారం ఓ రక్తదాన శిబిరంలో పాల్గొన్న తర్వాత ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.