గుట్టుగా వివాహం హోటల్‌లో కాపురం.. వీడిన ఓయో మర్డర్ మిస్టరీ!
హైదరాబాద్ మహానగరం ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని గోకుల్ ప్రైడ్ హోటల్ (ఓయో)గదిలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.హోటల్ స్టాఫ్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. వివరాల్లోకివెళితే.. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామంలో నివాసముండే శిరీష(34)కు 2013లో వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా 2016లో భర్తకు విడాకులు ఇచ్చి, తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తోంది.ఈ క్రమంలోనే శిరీషకు శ్రీనివాస్(38) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో గుడిలో శిరీషను పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాస్.. అయితే,ఏం జరిగిందో తెలీదు ఓయో రూంలో శిరీషను శ్రీనివాస్ హత్యచేసినట్టు పోలీసులు నిర్దారించారు.
