తెలంగాణ

కర్ణాటక ప్రభుత్వంతో చంద్రబాబు రహస్య ఒప్పందాలు

ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మేము దిగువన పోలవరం వద్ద గోదావరి నీళ్లను మళ్లించుకుంటాం.. మీరు ఎగువన ఆల్మట్టి డ్యామ్‌లో 16 టీఎంసీల కృష్ణా నీళ్లను నిలుపుకోండి, కానీ పోలవరం లింకు ప్రాజెక్టుకు మాత్రం మద్దతు ఇవ్వండి’ అంటూ చంద్రబాబు కర్ణాటక నేతలకు ఆఫర్ ఇచ్చారని మండిపడ్డారు. దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీటి ప్రవాహం తగ్గి, ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు, తెలంగాణ తాగునీటికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.