International

స్కూల్లో కాల్పులు..ముగ్గురు టీచర్లు, స్టూడెంట్స్ మృతి

ఓ విద్యార్థి ఘాతుకానికి ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు బలయ్యారు. పాఠశాలకు తుపాకీ తీసుకుని వచ్చిన ఓ స్టూడెంట్ విచక్షణారహితంగా కాల్పులు జరపడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో వెలుగుచూసింది. ఇదే ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల్లోకివెళితే.. బ్యాంకాక్ శివారులోని 'నాంథబురి' ప్రాంతంలో గల ఓ పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో తరగతిలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ స్టూడెంట్ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించాడు. గన్ శబ్దాలు విన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి వేరే క్లాస్ రూముల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు.