తెలంగాణ

School Holidays: స్కూళ్లకు లాంగ్ వీకెండ్.. వరుసగా 3 రోజులు సెలవులు?

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, విద్యాసంస్థల విద్యార్థులకు ఈ వారంలో వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ సెలవులు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకు వరుసగా పాఠశాలలకు విరామం లభించే అవకాశం ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 8వ తేదీన రెండవ శనివారం, ఆగస్టు 9వ తేదీన సాధారణ ఆదివారం కావడంతో ఎలాగూ సెలవులు ఉంటాయి.