National

మూతపడే ప్రమాదంలో పాఠశాల.. రక్తంతో ఉపాధ్యాయుడి లేఖ!

కర్ణాటకలో కన్నడ మాధ్యమ పాఠశాలలను కాపాడుకునేందుకు ఓ ఉపాధ్యాయుడు అత్యంత వేదనతో వినూత్న నిరసన చేపట్టారు. 1995 సంవత్సరం తర్వాత ప్రారంభమైన కన్నడ మీడియం పాఠశాలలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం (గ్రాంట్-ఇన్-ఎయిడ్) అందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా తన రక్తంతోనే ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఆ నిధులు లేకపోవడం వల్ల తమ పాఠశాల మూతపడే ప్రమాదంలో పడిందని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.