National

SBI Credit Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త బాదుడు!

SBI Credit Card: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు యూజర్స్‌కి బిగ్ షాక్ తగలనుంది. మరో 15 రోజుల్లో అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎస్‌బీఐ కార్డ్స్ రూల్స్‌లో భారీ మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు, ఇంధన కొనుగోళ్లపై అదనపు ఛార్జీల బాదుడుకు ఎస్‌బీఐ సిద్ధమైంది. ఈ కొత్త రూల్స్ అన్ని కేటగిరీల ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులకు వర్తించనున్నాయి. కాబట్టి ఈ నిబంధనలపై అవగాహన లేకపోతే డిసెంబర్ 1 నుంచి మీ జేబుకు అదనపు చిల్లు పడటం ఖాయం.కొత్త నిబంధనల ప్రకారం.. ట్రావెల్ సంబంధిత లావాదేవీలపై ఎస్‌బీఐ 1 శాతం అదనపు సర్‌ఛార్జీ వసూలు చేయనుంది. టోల్ ఛార్జీలు, వివిధ రకాల ట్రావెల్ బుకింగ్స్ ఇందులోకి వస్తాయి.