తెలంగాణ
చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి రమ్మని పిలుస్తున్నాడని..!
హైదరాబాద్ మహానగరంలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి బలవన్మరణానికి పాల్పడింది. గత కొద్ది రోజులుగా సదరు యువతి డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మరణించిన తన ప్రియుడు కలలోకి వచ్చి తనను రమ్మంటున్నాడని కుటుంబీలకు చెప్పిన యువతి.. ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన శంషాబాద్ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద.. నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉంది.ఇటీవల సిద్ధార్థ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుండి నర్మద డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే దారుణానికి ఒడిగట్టింది.
