National
Saudi Arabia: సౌదీ అరేబియాలో దాడులు.. భారత్ కీలక ప్రకటన
Saudi Arabia: సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు సాగిస్తున్న వరుస డ్రోన్ దాడులతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఇంధన కేంద్రాలు, పౌర విమానాశ్రయాలే లక్ష్యంగా జరిగిన ఈ భీకర దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఇండియన్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది.సాధారణ ప్రజలు తిరిగే ప్రదేశాలు, వాణిజ్య మౌలిక సదుపాయాలపై ఇలాంటి దాడులకు తెగబడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర విదేశాంగ శాఖ గట్టిగా స్పష్టం చేసింది. ఇలాంటి విధ్వంసకర చర్యలను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది. సౌదీ అరేబియా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే విషయంలో అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చింది.
