International

సౌదీ భారీ స్కెచ్: రూ.9,500 కోట్ల ఆఫర్!

 పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అత్యంత కీలకమైన రాజకీయ, దౌత్య పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. యెమెన్‌లోని హౌతీ (Houthi) తిరుగుబాటుదారులతో శాశ్వత కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదుర్చుకోవడం కోసం సౌదీ అరేబియా భారీ ప్రతిపాదన తెచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. తమ దేశ భూభాగంపై దాడులను తక్షణమే నిలిపివేస్తే, హౌతీలకు ఏకంగా 1 బిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.9,507 కోట్లు) ఆర్థిక సాయంగా అందించేందుకు సౌదీ ఆఫర్ చేసినట్లు గల్ఫ్ దౌత్య వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెల్లడించాయి.