National

Saudi Arabia: హౌతీలపై పోరుకు ఇజ్రాయెల్ సైనిక ఆఫర్.. వద్దని సౌదీ వెనక్కి తగ్గడానికి కారణాలు ఇవేనా?

Saudi Arabia: యెమెన్ నుంచి దూసుకొస్తున్న హౌతీ తిరుగుబాటుదారుల బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు సంపన్న సౌదీ సామ్రాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయిల్ ఫీల్డులు, ఎయిర్‌పోర్టులు టార్గెట్ కావడమే కాదు.. రాజధాని రియాద్ గగనతలంపైకి కూడా ముప్పు చేరడంతో సౌదీ అరేబియా తీవ్ర భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఉమ్మడి శత్రువైన హౌతీలను మట్టికరిపించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సంచలన సైనిక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ డీల్ ఫిక్స్ చేసేందుకు తెరవెనుక తీవ్రంగా చక్రం తిప్పింది. అయితే, ముంగిట్లోకి వచ్చిన ఇజ్రాయెల్ ఆర్మీ ఆఫర్‌ను సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ముఖం మీదే నిర్మొహమాటంగా తిరస్కరించడం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రాణసంకటమైన ముప్పు పొంచి ఉన్నప్పటికీ నెతన్యాహు ఆఫర్‌కు సౌదీ ఎందుకు చెక్ పెట్టింది? ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు లెక్కలేంటి?