International
Saudi Arabia missile strike: కింగ్ ఖలీద్ ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణి దాడి..12 మంది మృతి పలువురికి గాయాలు..
సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై ఇవాళ హౌతీలు జరిపిన క్షిపణి దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 300 మందికి పైగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. మృతి చెందిన వారిలో నలుగురు సౌదీ పౌరులు కాగా.. మిగతా వారు బంగ్లాదేశ్ , అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఫెలిస్తీన్, సూడాన్‌లకు చెందిన విదేశీ నివాసితులు ఉన్నారని తెలిపింది..
