క్రీడలు
Sarfaraz Khan: టీమిండియాలోకి సర్ఫరాజ్ ఖాన్ రీఎంట్రీ.. జట్టులో కీలక మార్పు!
శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో ఊహించని మార్పు చోటుచేసుకుంది. యువ ఓపెనింగ్/టాప్ ఆర్డర్ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలగడంతో, అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టులోకి తిరిగితీసుకుంది. గతంలో పరిమిత అవకాశాల్లో అద్భుతంగా రాణించినప్పటికీ స్థానం నిలబెట్టుకోలేకపోయిన సర్ఫరాజ్‌కు ఇది మంచి అవకాశంగా మారింది. అయితే, అతని రాకతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు తుది జట్టు (Playing XI) ఎంపిక విషయంలో కొత్త సవాలు ఎదురవుతోంది.
