National
SantiagoMartin: డీఎంకే, అన్నాడీఎంకేకు రూ.260 కోట్లు ఇచ్చిన లాటరీ సంస్థ!
SantiagoMartin: తమిళనాడులో ఉప్పు - నిప్పులా ఉండే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఎన్నికల ఖర్చులకు ఒకే ఒక్క లాటరీ కంపెనీ భారీగా డబ్బులు ఇచ్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోల్‌కతా కేంద్రంగా నడిచే 'టైగర్ అసోసియేట్స్' అనే లాటరీ సంస్థ.. ఈ రెండు పార్టీలకు కలిపి ఏకంగా రూ. 260 కోట్లు విరాళంగా ఇచ్చిందని ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి.దేశవ్యాప్తంగా ‘లాటరీ కింగ్’గా పేరున్న శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఈ సంస్థ, పోయినేడాదితో పోలిస్తే ఈసారి డబుల్‌కి పైగానే ముట్టజెప్పింది. పోయినేడాది రూ. 110 కోట్లు ఇస్తే, ఈ ఏడాది ఏకంగా రూ. 260 కోట్లకు పెంచేసింది. ఇందులో అన్నాడీఎంకే ఖాతాలో రూ. 135 కోట్లు పడగా, డీఎంకేకు రూ. 125 కోట్లు ఇచ్చారు.
