తెలంగాణ
వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం
Sangareddy Tragedy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో వినాయక నిమజ్జనం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో ఉన్న శిరీష అనాథాశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం ఆశ్రమానికి చెందిన విద్యార్థులు సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. నిమజ్జనం చేసే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి జారిపడ్డారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయి ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే జలసమాధి అయ్యారు. ఈ హృదయ విదారక ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
