సినిమా
Samantha: సినిమాల్లో దెబ్బలు తినడం ఫైట్స్ చేయడం బావుంది!
Samantha: సమంత ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, ఆమె నటించిన ది ఫ్యామిలీ మేన్ 2, సీటాడెల్; హనీ బన్నీ వెబ్ సిరీస్ గురించి.. అందులో చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పుకొచ్చింది. దెబ్బలు తింటూ ఫైట్స్ చేస్తుంటే ఎంతో ఉత్సాహంగా అనిపించిందని సమంత చెప్పింది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో సమంత అన్న మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం మెటర్నిటీ లీవ్‌లో ఉంది. స్క్రీన్ మీద కనిపించడానికి కొద్దిగా సమయం పడుతుంది. కానీ, స్క్రీన్ వెనకాల మాత్రం నిర్మాతగా యాక్టివ్గానే ఉంటోంది.
