వ్యాపారం

అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ ఫుడ్ లైసెన్సులు రద్దు

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు అయిన అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్‌లకు సంబంధించిన ఫుడ్ లైసెన్సులను కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. నిబంధనలు అతిక్రమించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఆహారంగా తీసుకునేందుకు ఎందుకు పనికిరాని, విషపూరితమైన ఉమ్మెత్త కాయలు, వాటి విత్తనాలను స్టోర్ చేసి మరీ విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ కోల్డ్ స్టోరేజీల్లో ఉమ్మెత్త కాయలు,వాటి విత్తనాలు లభ్యం కావడంతో ఆయా సంస్థల ఫుడ్ లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.