తెలంగాణ
ఒకటో తేదీన జీతాలు.. ప్రచారానికే పరిమితమా?
రాష్ట్రంలోని మత్స్యశాఖలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులకు వేతనాలు రావడం లేదని తెలుస్తోంది. మూడు నెలలుగా జీతాలు లేక మత్స్యశాఖ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అటెండర్లతో పాటు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాలేదని సమాచారం. ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వాలని జీవో జారీ చేసినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నా.. తమకు మాత్రం ఇంతవరకు జీతాలు రాలేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అలవెన్సులు రాక క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్లు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.
