ఏపీ

సీబీఐకి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు ఆదేశం

గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది. అంతేకాకుండా, మృతుడు సాయికృష్ణ తల్లి గాదె విజయ లక్ష్మికి రూ.25 లక్షల పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోనే పరిహారం అందజేయాలని కోర్టు స్పష్టంచేసింది. కాగా, 25 ఏళ్ల గాదె సాయికృష్ణను ఈ ఏడాది మే నెలలో గతంలో అతని ఉన్న రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లలో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం వద్ద అదుపులోకి తీసుకున్నారు.ఆ తర్వాత కృష్ణలంకకు తరలించగా అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు.దీంతో సాయికృష్ణ తల్లి పోలీసులను అశ్రయించింది. వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో తన కుమారుడిని పోలీసులు లాకప్ డెత్ చేశారని ఆరోపిస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.