ఏపీ

కాకినాడకు సాధిక్.. ఏఈ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

ఏపీలో సాధిక్ అనే కోచ్ కారణంగా కాకినాడ ఏఈ నూకరాజు ఫ్యామిలీ సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. నూకరాజు, అతని భార్య, కోడలు, మనవడు గోదావరిలో దూకగా.. కేవలం మనవడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వారంతా మరణించిన విషయం తెలిసిందే. వీరి మరణానికి కోచ్ సాధిక్ కారణమని..అతను తన కుటుంబాన్ని వేధించాడని,తన కొడుకు భాస్కర్ రెడ్డి మరణానికి కారకుడు అని.. తన కోడలిని వేధింపులకు గురిచేయడంతో పాటు అశ్లీల వీడియోలు,ఫొటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశాడని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. నలుగురి మరణానికి కారణమైన సాధిక్.. మొన్నటివరకు అజ్ఞాతంలోకి వెళ్లగా.. నిందితుడు సాధిక్ ఖాన్‌ను ఢిల్లీలో కాకినాడ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఢిల్లీ నుంచి రైలులో సాధిక్ ఖాన్‌ను కాకినాడకు తరలించగా.. జి.మేడపాడు నుంచి వాహనంలో కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.