Sabarimala Special Trains: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. శబరిమలకు ఏకంగా 54 స్పెషల్ ట్రైన్స్.. తేదీలు ఇవే!
Sabarimala Special Trains: శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న అయ్యప్ప స్వాములు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏకంగా 54 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ స్పెషల్ ట్రైన్లు రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్ - కొల్లం - హైదరాబాద్ మధ్య నల్గొండ, మిర్యాలగూడ మీదుగా మొత్తంగా ఎనిమిది ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ఇందులో 07193 నంబర్ రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (శనివారం) రాత్రి 11.10 గంటలకు హైదరాబాద్లో బయల్దేరి, సోమవారం ఉదయం 7.15 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే, 07194 రైలు డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో (సోమవారం) ఉదయం 10.55 గంటలకు కొల్లంలో బయల్దేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
