National

Rummy Culture: ఫోన్ స్క్రీన్ వెనుక వేల కోట్ల మాఫియా.. తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా ఆగని దందా!

Rummy Culture: చేతిలో స్మార్ట్‌ఫోన్ ఆన్ కాగానే చాలు.. ‘లక్షలు గెలవండి.. జీవితాన్ని మార్చుకోండి’ అంటూ ప్రత్యక్షమయ్యే ఆకర్షణీయమైన ప్రకటనలు. ఒక్క క్లిక్‌తో మొదలయ్యే సరదా, క్షణాల్లోనే వ్యసనంగా మారి సామాన్యుడి జేబులను గుల్ల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పేకాట, రియల్ మనీ గేమింగ్‌పై కఠిన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, కార్పొరేట్ ముసుగులో సాగుతున్న ఈ డిజిటల్ దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. చట్టాల కళ్లుగప్పి తెరవెనుక సాగుతున్న వేల కోట్ల అక్రమ దందాపై ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంజా విసిరింది. ‘రమ్మీ కల్చర్’ అక్రమ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన మెరుపు దాడులు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.