టాప్ న్యూస్
రెండో ఖాతా తెరిచిన అధికార ఎమ్మెల్యే.. అయ్యో అలా ఎలా దొరికిపోయావ్!
అధికార కాంగ్రెస్లో లేటు వయసులో ఓ ఎమ్మెల్యే వెలగబెట్టిన యవ్వారం ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారింది. దక్షిణ తెలంగాణ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత.. రెండో ఖాతా తెరిచినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన భార్య బయటపెట్టినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన దక్షిణ తెలంగాణ లోని ఓ నియోజకవర్గం నుండి పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయినట్టు సమాచారం. ఎమ్మెల్యే మీద మనసు పడిన ఓ పడతితో ఆయన ప్రేమలో పడినట్టు సమాచారం. ఈ వ్యవహారం చాలా కాలం నుంచే గుట్టుగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
