ఆర్టీసీ దోపిడీ షురూ.. 50 శాతం అదనపు చార్జీలు వసూళ్లు
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి.ప్రజారవాణా వ్యవస్థ టీజీఎస్ఆర్టీసీ ‘స్పెషల్’ సర్వీసుల పేరిట అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రయాణాన్ని బట్టి చార్జీలు పెరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి దూర ప్రాంతాలకు జర్నీ చేసే వారికి ఒక్కరికే టికెట్ ధర రూ.500 నుంచి 700 మధ్యలో ఉన్నట్టు తెలుస్తోంది.ఎక్స్ప్రెస్,డీలక్స్,సూపర్ లగ్జరీ, ఈవీ సర్వీసులను బట్టి టికెట్ ధరలు భిన్నంగా ఉన్నాయి.సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఎక్స్ప్రెస్ బస్ టికెట్ ధర రూ.290 నుంచి 320 మధ్యలో ఉండగా, ఇప్పుడు రూ.400కు పైగా వసూలు చేస్తున్నట్టు తెలిసింది.అయితే, ఒక్కరికే ఇంత చార్జ్ అయితే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే వాళ్ల పరిస్థితి ఏంటని, రానుపోను టికెట్ చార్జీలకే రూ.5 వేలకు పైగా ఖర్చు కానుంది. ఇక సామాన్యుడు దసరా పండుగ ఎలా చేసుకోవాలి? అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
