National
రాహుల్ నుంచి RSS వరకు.. Gen Zపై ఇంత ఫోకస్ ఎందుకు?
Gen Zని కేవలం ఓటర్లుగా చూస్తే సరిపోదు. వాళ్లే ఇప్పుడు నేరుగా రాజకీయ కథనాలను తయారు చేసే శక్తిగా మారుతున్నారు. ఒక వీడియో వైరల్ చేస్తారు.. ఒక సమస్యపై సోషల్ మీడియాలో చర్చ మొదలుపెడతారు.. కొన్ని గంటల్లో అది జాతీయ స్థాయి అంశంగా మారుతుంది. అంటే గతంలో రాజకీయ పార్టీలు ప్రజలకు తమ అజెండాను చెప్పేవి.
