National

RSS Chief Mohan Bhagwat: జెన్ Z, జెన్ ఆల్ఫా యువతతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ!

ఆర్ఎస్ఎస్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ దేశ భవిష్యత్తుకు నిర్దేశకులైన జెన్ Z (Gen Z), జెన్ ఆల్ఫా తరాలకు చెందిన యువతతో కీలక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దేశ నిర్మాణం, నాయకత్వ లక్షణాల పెంపొందింపు, ప్రపంచాన్ని ఏకం చేయడంలో భారతదేశ వహిస్తున్న కీలక పాత్ర వంటి అంశాలపై ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. ‘ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ (IIMUN)’ సంస్థ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC) వేదిక నేడు ఈ సదస్సు ప్రారంభం కానుంది.