వైరల్ న్యూస్

భిక్షురాలి ఇంట్లో కట్టల కొద్దీ నగదు

భిక్షాటన చేసే ఓ వృద్ధురాలి ఇంట్లో రూ.40 లక్షల నగదు లభ్యం కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యలో వెలుగుచూసింది. స్థానికంగా ఉండే మసీదు వద్ద ఓ వృద్ధురాలి భిక్షాటన చేస్తూ జీవనం సాగించేంది. అయితే, ఏళ్లుగా మసీదు బయట భిక్షాటన చేస్తూ జీవించిన హూర్ అనే వృద్ధురాలు ఇటీవల మృతి చెందింది. అంత్యక్రియల అనంతరం ఆమె ఇంటికి వెళ్లిన స్థానికులకు గోనె సంచుల్లో భారీగా నగదు, నాణేలు కనిపించడంతో అంతా షాక్‌ అయ్యారు.వాటిని లెక్కించగా..దాదాపు రూ.30-40 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. తనను కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని, భిక్షాటనే తన జీవనాధారమని హూర్ చెప్పేదని స్థానికులు తెలిపారు.ఆమె దాచుకున్న డబ్బును మసీదుకు విరాళంగా ఇవ్వాలని కొందరు సూచించగా.. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించబోమని మసీదు కమిటీ తిరస్కరించినట్లు సమాచారం.