తెలంగాణ
ఎకరం రూ.200 కోట్లు.. రూ.10 వేల కోట్లు తెచ్చిన రేవంత్ రెడ్డి : మన్నె క్రిశాంక్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన భూముల కబ్జాలు, సీఎం తెచ్చిన అప్పులపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ప్రెస్మీట్ నిర్వహించిన ప్రతిసారి పోలీసులు అరెస్టు చేయడం, బెదిరింపులకు గురిచేయడం చేస్తునన్నారని, అయినప్పటికీ వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేశారు.అయితే, హైదరాబాద్ మహానగరం పరిధిలోని 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క ఎకరం విలువ రూ.200 కోట్లు ఉండగా.. ఎకరానికి కేవలం రూ.17 కోట్లకే తాకట్టు పెట్టారని ఆరోపించారు.ఏరియాల తాకట్టు పెట్టిన భూముల వివరాలు వెల్లడించారు.
