తెలంగాణ
నీటి ఎద్దడి నివారణకు రూ.120కోట్లు విడుదల.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!
ఎల్నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ తాగునీటి సౌకర్యాల కల్పనకు భారీగా ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 'సింగూరు' ప్రాజెక్టు ఆధారిత ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాలు తీర్చడానికి రూ.120 కోట్లను కేటాయించినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
