క్రీడలు

RohitSharma: అంతర్జాతీయ క్రికెట్‌ లో మరో చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ

RohitSharma: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ పరుగుల సునామీ సృష్టించాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే విండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుతూ ప్రపంచ క్రికెట్‌లోనే అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న భారీ రికార్డును హిట్‌మ్యాన్ దాటేశాడు.వన్డేల్లో ఇన్నింగ్స్‌లో స్టార్ట్ చేసే బ్యాటర్‌గా అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని చేరిన మొట్టమొదటి ప్లేయర్‌గా రోహిత్ సరికొత్త మార్క్ సెట్ చేశాడు. ఈ ఘనత అందుకోవడానికి సచిన్‌కు 214 ఇన్నింగ్స్‌లు పడితే, రోహిత్ కేవలం 202 ఇన్నింగ్స్‌ల్లోనే దాన్ని బ్రేక్ చేసి టాప్‌లోకి దూసుకెళ్లాడు.